: మా ఆవిడను రొమాంటిక్ క్యారెక్టర్లలో చూడాలని ఉంది: సైఫ్ అలీఖాన్
తన భార్య కరీనాకపూర్ ను రొమాంటిక్ క్యారెక్టర్లలో చూడాలని ఉందంటూ బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్ అన్నాడు. మీడియాకు యిచ్చిన ఇంటర్వ్యూలో సైఫ్ మాట్లాడాడు. 'జబ్ వి మెట్' సినిమాలో కరీనా కపూర్ పాత్ర తనకు చాలా ఇష్టమన్నారు. తండ్రిని కావాలనే తొందరలేదని, ఇప్పుడే సంతానం కోసం ఆరాటపడటం లేదని సైఫ్ చెప్పాడు. కరీనా కోరుకున్నప్పుడే సంతానం గురించి ఆలోచన చేస్తామన్నారు. వివాహం తర్వాత కరీనా కెరీర్ చాలా బాగా ఉందని అన్నాడు. తన అత్త బబితకు తాను నటించిన రొమాంటిక్, కామెడీ సినిమాలంటే ఇష్టమని సైఫ్ చెప్పాడు.