: తప్పతాగి కన్నతల్లిని హతమార్చాడు!


తప్పతాగిన మైకంలో కన్నతల్లిని హతమార్చాడు ఓ కిరాతకుడు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ఈ రోజు జరిగింది. పోలీసుల కథనం ప్రకారం ముక్కుడు దేవిపల్లి గ్రామానికి చెందిన బయ్యా బక్కమ్మకు ముగ్గురు సంతానం. ఆ ముగ్గురిలో ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. పీకల దాకా తాగి ఇంటికి వచ్చిన కొడుకుల్లో ఒకడు తల్లితో గొడవ పడ్డాడు. ఆ మైకంలో తల్లి తలపై బండరాయితో కొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు ముక్కుడు దేవిపల్లి గ్రామం చేరుకుని, విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News