: మోదీతో నితీష్ కు పోలిక కుదరదు: బాబా రాందేవ్
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో బీహర్ ముఖ్యమంత్రిని పోల్చడం కుదరదని, ‘నాట్ లాజికల్’ అంటూ యోగ గురువు బాబా రాందేవ్ వ్యాఖ్యానించారు. రాజస్థాన్ లోని బీఎస్ఎఫ్ జవాన్లకు ప్రస్తుతం ఆయన యోగా తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోదీ వికాస్ పురుష్ అని, అటువంటి వ్యక్తితో నితీష్ కు పోలిక కుదరదని అన్నారు. ఎందుకంటే, నితీష్ చాలా చిన్నవాడని చెప్పుకొచ్చారు. అభివృద్ధి పరంగా మోదీ వికాస్ పురుష్ అని బాబా రాందేవ్ అభివర్ణించారు. ప్రస్తుతం బీహార్ ప్రజలకు సుపరిపాలన అందించడమనేది పెద్ద అంశమనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మన నల్లకుబేరులు విదేశాలలో కూడబెట్టుకున్న నల్లధనాన్ని మోదీ ప్రభుత్వం వెనక్కి రప్పిస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉందని రాందేవ్ అన్నారు.