: కోల్ కతా, ముంబై, చెన్నై నగరాలు నీటిలో కలిసిపోనున్నాయా?


భారతదేశంలోని కోల్ కతా, ముంబై, చెన్నై మహానగరాలకు ముప్పుతప్పదా? అంటే పరిస్థితులు ఇలాగే కొనసాగితే ముప్పుతప్పదని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. భూమిలోపల ఉన్న శిలాజ ఇంధన నిల్వలను పూర్తిగా తోడుకుంటూ వెళ్లిపోతే పెను ప్రమాదం తప్పదని వారు స్పష్టం చేశారు. కోట్లాది సంవత్సరాలలో భూమిలో ఏర్పడిన బొగ్గు, చమురు, గ్యాస్ నిక్షేపాలు పూర్తిగా హరించి వేస్తే అంటార్కిటికా హిమ ఖండం పూర్తిగా కరిగిపోయి సముద్ర నీటి మట్టం 50 నుంచి 60 మీటర్లు (160 అడుగుల నుంచి 200 అడుగులు) పెరిగే అవకాశం ఉందని వారు పేర్కొన్నారు. అలా జరిగితే టూరిస్టు క్షేత్రాలుగా చెప్పుకుంటున్న మహానగరాలేవీ మిగలవని వారు హెచ్చరిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణకు జాగ్రత్తలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. ప్రమాదం సంభవిస్తే నీటమునిగే నగరాలుగా టోక్యో, షాంఘై, హాంగ్ కాంగ్, హొంబర్గ్, న్యూయార్క్ నగరాలతో పాటు మన దేశంలోని మూడు మెట్రోపాలిటన్ నగరాలు కూడా ఉండడం ఆందోళన రేపుతోంది.

  • Loading...

More Telugu News