: యూఎన్ఓ సమావేశానికి మాలావత్ పూర్ణ
అతిచిన్న వయస్సులో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మాలావత్ పూర్ణకు మరో అరుదైన అవకాశం లభించింది. అమెరికాలోని న్యూయార్క్ లో ఈ నెల 25, 26 తేదీల్లో జరగనున్న జనరల్ అసెంబ్లీలో మాట్లాడే అవకాశం పూర్ణకు దక్కింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అవకాశం లభించింది కేవలం ఇద్దరికి మాత్రమే. అందులో మాలావత్ పూర్ణ ఒకరు. యూఎన్ఓ జనరల్ అసెంబ్లీలో 'భారతదేశంలో పేదరికం' అనే అంశంపై ఆమె మాట్లాడనుంది. ఈ సందర్భంగా పూర్ణ శనివారం అమెరికాకు బయలుదేరి వెళ్లారు. ఈ అవకాశం తనకు లభించడంపై పూర్ణ ఏమంటున్నారంటే...'తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సహకారంతోనే నాడు ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించా. నా ప్రతిభను గుర్తించి యూఎన్ఓ ఈ అవకాశం ఇవ్వడం నాకు చాలా సంతోషంగా ఉంది' అని పూర్ణ అన్నారు.