: రఘువీరాపై ‘మట్టి‘ దాడి... కృష్ణా జిల్లా కోనలో ఏపీసీసీ చీఫ్ కు చేదు అనుభవం


ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ ఎన్.రఘువీరారెడ్డికి కొద్దిసేపటి క్రితం చేదు అనుభవం ఎదురైంది. బందరు పోర్టు కోసం ప్రభుత్వం సేకరించనున్న భూముల పరిశీలనకు వెళ్లిన రఘువీరాపై కృష్ణా జిల్లా కోన గ్రామస్థులు మట్టితో దాడి చేశారు. బందరు పోర్టు కోసం భూములిచ్చేది లేదని ఇప్పటికే గ్రామస్థులు తేల్చిచెప్పారు. మచిలీపట్నం ఎంపీ కొనకళ్ల నారాయణ, మంత్రి కొల్లు రవీంద్ర ఎంతమేర నచ్చజెప్పినా రైతుల్లో మార్పు రాలేదు. ఈ క్రమంలో అక్కడి పరిస్థితిని సమీక్షించడంతో పాటు భూముల పరిశీలనకు రఘువీరా నేటి ఉదయం కోన గ్రామానికి వెళ్లారు. తమ గ్రామంలో రాజకీయ నేతను చూసిన కోన గ్రామస్థులు ఒక్కసారిగా ఆగ్రహోదగ్రులయ్యారు. తమ గ్రామంలోకి ఏ ఒక్క రాజకీయ నాయకుడి ప్రవేశానికి వీలు లేదని చెప్పిన గ్రామస్థులు రఘువీరాపై మట్టితో దాడి చేశారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News