: రాకేశ్ నిజంగానే సూపర్ కాప్... మాటలతోనే ముప్పుతిప్పలు పెట్టి, మూడు చెరువుల 'నీళ్లు' తాగిస్తాడట!


దేశవ్యాప్తంగా సంచలనం రేపిన షీనా బోరా హత్య కేసులో వారం వ్యవధిలోనే నేరస్థులతో నిజం కక్కించిన ముంబై మాజీ పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియాను నిజంగానే ‘సూపర్ కాప్’ అంటున్నారు అక్కడి పోలీసులు. సాధారణ నేరగాళ్లు సహా కరుడుగట్టిన ఉగ్రవాదులతోనూ నిజం కక్కించడంలో ఆయన దిట్ట. షీనా బోరా హత్య కేసులో ఆమె తల్లి ఇంద్రాణి ముఖర్జియా నుంచి నిజం రాబట్టేందుకు ముంబై పోలీసులు థర్డ్ డిగ్రీని ప్రయోగించారన్న వదంతులు వినిపించాయి. అయితే, అందులో ఏమాత్రం వాస్తవం లేదట. ఎందుకంటే, విచారణలో రాకేశ్ మారియా అనుసరించే విధానాలతో ఒక్క ఇంద్రాణి ఏమిటీ? ముంబైలో మారణహోమానికి పాల్పడ్డ అజ్మల్ కసబ్ నుంచి పలువురు టెర్రరిస్టులు కూడా ఒక్క దెబ్బ కూడా తినకుండానే నిజం కక్కారట. ఇంటరాగేషన్ లో రాకేశ్ మారియా సినిమా స్టయిల్లో రెచ్చిపోతారట. నూనె, కారం ఎక్కువగా ఉన్న ఆహారం పెట్టడమే కాక జిలేబీతో నిందితుల నోరు తీపి చేసే మారియా ఆ తర్వాత తాగేందుకు మాత్రం నీరివ్వరట. నిజం చెబితేనే, నీరిస్తానంటూ ఆయన సాగించే ఇంటరాగేషన్ లో ఎంతటి కరుడుగట్టిన నేరస్థుడైనా నిజం కక్కాల్సిందే. ఈ విధానంతోనే కసబ్ నేరాంగీకారాన్ని మారియా నమోదు చేశారు. షీనా బోరా హత్య కేసును రోజుల వ్యవధిలోనే తేల్చేసిన ఆయనను మహారాష్ట్ర ప్రభుత్వం ప్రమోషన్ పేరిట బదిలీ చేసిన నేపథ్యంలో సూపర్ కాప్ ఘనతలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

  • Loading...

More Telugu News