: కాకినాడలో ప్రేమ పేరిట మోసం చేస్తున్న కీచకుడి అరెస్ట్


తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఓ కీచకుడి వ్యవహారం వెలుగుచూసింది. కాకినాడకు చెందిన హరీష్ కుమార్ అనే యువకుడు ఇంజనీరింగ్ పూర్తి చేసి అమ్మాయిల వెంటపడేవాడు. ఈ క్రమంలో నాలుగేళ్ల క్రిందట రాజమండ్రి నుంచి వస్తున్న ఓ యువతిని బస్సులు లేకపోవడంతో బైక్ పై దిగబెడతానంటూ ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో మాటలు కలిపిన హరీష్ కుమార్ యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. ఎలాగూ పెళ్లి చేసుకునే వాళ్లమే కనుక సరదాగా గడుపుదామంటూ ప్రతిపాదించాడు. ఈ ప్రతిపాదనకు యువతి ఒప్పుకోకపోవడంతో ఆమెకు డ్రింక్ ఆఫర్ చేశాడు. అందులో మత్తుకలిపి యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. దానిని వీడియో తీసి దాచాడు. ఇటీవలి కాలంలో హరీష్ ఆమెను దూరం పెట్టడంతో ఆరాతీసిన యువతికి అతనికి తనలాగే చాలా మందితో సంబంధాలు ఉన్నాయన్న వాస్తవం తెలిసింది. దీంతో ఆమె మండపేట పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు షాకయ్యారు. అతను చాలా మందితో ప్రేమ నాటకం ఆడాడని తేలింది. అతని ఫోన్ లో అభ్యంతరకర వీడియోలు చాలా బయటపడ్డాయి. ఆమెలాగే చాలా మంది యువతులను ప్రేమ పేరిట బ్లాక్ మెయిల్ చేశాడని నిర్ధారించిన పోలీసులు, అతనిపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News