: మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్లకు చేదు అనుభవం


ఆంధ్రప్రదేశ్ మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ కొనకళ్ల నారాయణకు కృష్ణా జిల్లా మచిలీపట్నం మండలం కోన గ్రామంలో చేదు అనుభవం ఎదురైంది. బందరు పోర్టుకు భూములివ్వాలంటూ రైతులను కోరేందుకు మంత్రి రవీంద్ర, ఎంపీ కొనకళ్ల కోన గ్రామం పర్యటనకు బయల్దేరారు. తమ జీవనాధారం ఈ భూములేనని, వీటిని కోల్పోతే తమకు భవిష్యత్ లేదని, తమ భవిష్యత్ ను లాక్కునేందుకు ప్రయత్నించవద్దని రైతులు స్పష్టం చేశారు. భూములివ్వాలంటూ తమపై ఒత్తిడి తెస్తున్నారంటూ గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా చోటుచేసుకున్న పెనుగులాటలో మంత్రి వ్యక్తిగత కార్యదర్శి గాయపడ్డారు. దీంతో రంగప్రవేశం చేసిన పోలీసులు గ్రామస్థులను శాంతింపజేశారు. దీంతో మంత్రి, ఎంపీ వేరే గ్రామాల పర్యటనకు వెళ్లారు. అక్కడ కూడా రైతులు సానుకూలంగా స్పందించలేదని సమాచారం.

  • Loading...

More Telugu News