: పాలకొల్లు అమ్మవారికి విరాళంగా బంగారు జడ
పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి దేవస్థానానికి 68 గ్రాముల బంగారు జడను విరాళంగా అందజేశారు. ఓదూరు గ్రామానికి చెందిన ఎంఎస్ జానకిరామరాజు దంపతులు ఈ విరాళాన్ని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీకి శనివారం అందజేశారు. బంగారు జడపై ముత్యాలు, ఎర్ర, పచ్చని రాళ్లు పొదిగి ఉన్నాయి. పార్వతి అమ్మవారి కోసం అరవై ఎనిమిది గ్రాముల బంగారు జడను తయారుచేయించి ఇచ్చామని దాతలు తెలిపారు.