: భార్యను నరికి చంపిన మానసికరోగి!
ఓ భర్త తన భార్యను నరికిచంపిన సంఘటన మహబూబ్ నగర్ జిల్లా కోడేరు మండలంలో ఈ రోజు ఉదయం జరిగింది. ఎత్తం గ్రామానికి చెందిన బాలస్వామి (50) శుక్రవారం ఉదయం భార్య చంద్రమ్మ(46)తో కలిసి సింగపట్నంలోని సంగమేశ్వర గ్రామీణ బ్యాంక్ కు వెళ్లాడు. రూ. 40 వేల పంట రుణం తీసుకుని ఇంటికొచ్చాడు. రాత్రి నిద్రకు ఉపక్రమించే ముందు కూడా బాలస్వామి బాగానే ఉన్నాడు. అర్ధరాత్రి సమయంలో భార్య తలను గొడ్డలితో నరికి వేశాడు. చనిపోయిన భార్య తలలోని మెదడును బయటకు తీసి పట్టుకుని శనివారం ఉదయం ఇంటిముందు కూర్చున్నాడు బాలస్వామి. తాను పొట్టేలును కోశానని పక్క ఇళ్ల వారికి చెప్పడంతో వారికి అనుమానం వచ్చింది. లోపలికి వెళ్లి చూడటంతో అసలు విషయం తెలిసింది. బాలాస్వామి కొన్నాళ్లుగా మానసిక వ్యాధితో బాధపడుతున్నట్టు చుట్టుపక్కల వారు చెప్పారు. ఈ సమాచారాన్ని కోడేరు పోలీసులకు చెప్పడంతో వారు సంఘటనా స్థలానికి వచ్చారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.