: విజయవాడ, విశాఖ మెట్రోల సమగ్ర నివేదిక అందజేసిన శ్రీధరన్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విజయవాడ, విశాఖపట్టణాల్లో నిర్మించతలపెట్టిన మెట్రోరైల్ ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర నివేదికను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు మెట్రోరైల్ సలహాదారు శ్రీధరన్ అందజేశారు. విజయవాడ ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుతో కలసి శ్రీధరన్ సీఎం చంద్రబాబును కలిశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు సమక్షంలో ఏపీలోని ప్రధాన నగరాల్లోని మెట్రోరైల్ ప్రాజెక్టు నిర్మాణంపై సమగ్ర నివేదికను అందజేశారు. దీనిపై నేటి సాయంత్రం వెంకయ్యనాయుడు, చంద్రబాబు సంయుక్తంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలు వెల్లడించనున్నారు.