: వైసీపీ నాయకుడి మైక్ కట్... కార్యకర్తల నిరసన
వైఎస్సాఆర్ సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే దేవుడు మాట్లాడుతుండగా ఆయన మైక్ ను కట్ చేసిన సంఘటన విశాఖపట్టణంలోని కొయ్యూరు మండలంలో ఈ రోజు జరిగింది. బాక్సైట్ తవ్వకాలపై వైఎస్సాఆర్ సీపీ ఆధ్వర్యంలో మండలంలోని రాజేంద్రపాలెంలో సభ నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుడు మాట్లాడుతుండగా పోలీసులు మైక్ కట్ చేశారు. దీంతో ఆ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. తమ నేత మాట్లాడుతుంటే మైక్ ఎందుకు కట్ చేస్తారంటూ కార్యకర్తలు పోలీసులను ప్రశ్నించారు. సభ నిర్వహణకు అనుమతి ఇవ్వలేదని, అందుకే మైక్ కట్ చేశామని పోలీసులు సమాధానం చెప్పారు.