: మద్యం కోసం భార్య డబ్బివ్వలేదంటూ ఆత్మహత్య!


మందు కొట్టేందుకు భార్య డబ్బివ్వడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన అనంతపురం పట్టణంలో జరిగింది. పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం, పట్టణంలోని సున్నపుగేడు ప్రాంత నివాసి బసురుల్లా, బస్టాండులోని ఓ హోటల్ లో పనిచేస్తుంటాడు. మద్యం అలవాటు చేసుకున్న ఆయన తరచూ డబ్బివ్వాలని భార్యను వేధిస్తుంటాడు. నేటి ఉదయం సైతం అదే విధంగా డబ్బివ్వాలని భార్యను కోరగా, ఆమె నిరాకరించింది. దీంతో బస్టాండు వద్దకు వచ్చిన బసురుల్లా, అక్కడే ఉన్న ఓ చెట్టుకు ఉరి వేసుకున్నాడు. ప్రయాణికుల సమాచారం మేరకు ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

  • Loading...

More Telugu News