: ఉండవల్లి చూపు వైకాపా వైపు!: గాలి


ఇటీవలి కాలంలో వైఎస్ రాజశేఖరరెడ్డిని తెగ పొగుడుతున్న ఉండవల్లి అరుణ్ కుమార్ వైఖరి చూస్తుంటే, ఆయన వైకాపాలో చేరేలా ఉన్నారని అనిపిస్తోందని తెదేపా నేత గాలి ముద్దుకృష్ణమనాయుడు వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన జగన్ కు మాదిరిగానే రాయలసీమ అభివృద్ధి చెందడం ఉండవల్లికి కూడా ఇష్టం లేనట్టుందని విమర్శించారు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన పట్టిసీమ ప్రాజెక్టుపై ఆరోపణలు చేయడం దారుణమని దుయ్యబట్టారు. గోదావరి నీటిని కృష్ణానదికి తరలించి చరిత్రలో నిలిచిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. ఉండవల్లి అరుణ్ కుమార్ నిజాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.

  • Loading...

More Telugu News