: ఢిల్లీ యూనివర్శిటీ ఎన్నికల్లో 'ఆప్' విద్యార్థి విభాగాన్ని మట్టి కరిపించిన ఏబీవీపీ
ప్రతిష్ఠాత్మక ఢిల్లీ యూనివర్శిటీ స్టూడెంట్స్ యూనియన్ (డీయూఎస్‌యూ) ఎన్నికల్లో ఆర్ఎస్ఎస్ (రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్) స్టూడెంట్స్ విభాగం ఏబీవీపీ (అఖిల భారత విద్యార్థి పరిషత్) క్లీన్ స్వీప్ చేసింది. ఏబీవీపీ తరపున అధ్యక్షుడిగా పోటీ చేసిన సతీందర్ అవానా, ఉపాధ్యక్షుడిగా బరిలో నిలబడ్డ సన్నీ దేఢా, కార్యదర్శిగా నిలబడ్డ అంజలీ రాణా, సంయుక్త కార్యదర్శిగా పోటీ పడ్డ ఛత్రపాల్ యాదవ్ లు విజయం సాధించారు. కాంగ్రెస్ అనుబంధ నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్యూఐ) అభ్యర్థుల నుంచి నామమాత్రపు పోటీ రాగా, 'ఆప్' అనుబంధ 'ఛాత్ర యువ సంఘర్ష్ సమితి' నుంచి కాస్తంత గట్టి పోటీయే ఎదురైనప్పటికీ, ఏబీవీపీ ఘన విజయం సాధించింది. వర్శిటీ విద్యార్థుల్లో 43.3 శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారని అధికారులు తెలిపారు.