: ఇకపై సామాన్యులకు అందుబాటులో చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ లో ఇకపై సామాన్యులు తమ సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుతో ప్రత్యక్షంగా మొరపెట్టుకోవచ్చు. నేటి నుంచి ఏపీ సీఎం సామాన్యులకు అందుబాటులో ఉంటారని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. ప్రతి రోజూ మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకూ విజయవాడ క్యాంపు కార్యాలయానికి వచ్చే సందర్శకులను చంద్రబాబు స్వయంగా కలుస్తారని తెలిపింది. ఈ మేరకు క్యాంప్ ఆఫీస్ ఎదుట అధికారులు నోటీసులు పెట్టారు. ముఖ్యమంత్రిని కలవాలనుకున్న వారు పేర్లు నమోదు చేయించుకుని కలవవచ్చని ప్రకటించారు. ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలను సీఎం స్వయంగా తీసుకోనున్నారు. అక్కడికక్కడే సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేసే అవకాశాలూ ఉన్నాయి.