: న్యూఢిల్లీ, బీహార్ లను చుట్టేసింది... తెలంగాణకూ వస్తానంటోంది!


ఇప్పటికే దేశ రాజధానితో పాటు, బీహార్ లో పలు నిర్మాణ ప్రాజెక్టులను చేపట్టిన చైనా సంస్థ 'చొంక్వింగ్ ఇంటర్నేషనల్ కన్ స్ట్రక్షన్ కార్పొరేషన్' కన్ను ఇప్పుడు తెలంగాణపై పడింది. తెలంగాణకు పెట్టుబడులతో వస్తామని చొంక్వింగ్ చెబుతోంది. ఈ మేరకు చైనా పర్యటనలో ఉన్న టీఎస్ సీఎం కేసీఆర్ బృందంతో చొంక్వింగ్ ప్రతినిధులు సమావేశమై చర్చించారు. తెలంగాణ అభివృద్ధిలో భాగంగా, మౌలిక సదుపాయాల కల్పన, వివిధ ప్రాజెక్టులపై సంస్థ తయారు చేసుకున్న పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను చొంక్వింగ్ ప్రతినిధులు సీఎం టీమ్ కు చూపించారు. ప్రస్తుతం చైనాలో ఆరో రోజు పర్యటనలో ఉన్న కేసీఆర్, నేడు పలు కంపెనీలతో భేటీ కానున్నారు. చైనా రైల్వే కార్పొరేషన్, చైనా ఫార్చ్యూన్ ల్యాండ్, గ్రీన్ సిటీ లిమిటెడ్, శాని గ్రూప్ లతో ఆయన సమావేశమై పెట్టుబడుల నిమిత్తం చర్చలు జరపనున్నారు.

  • Loading...

More Telugu News