: షీనా బోరా కూడా తక్కువేం తినలేదు... తల్లినే బ్లాక్ మెయిల్ చేసిందట!
సంచలనం సృష్టించిన షీనా బోరా హత్య కేసులో మరో కోణం వెలుగులోకి వచ్చింది. కన్న కూతుర్ని చంపడానికి ఇంద్రాణి సిద్ధం కావడానికి ఇదే కారణమని పోలీసులు భావిస్తున్నారు. షీనా బోరా తన తల్లిని బ్లాక్ మెయిల్ చేసిందట. ముంబైలోని అత్యంత ధనిక ప్రాంతాల్లో ఒకటైన బాంద్రాలో త్రిబుల్ బెడ్ రూం ఫ్లాట్ కావాలని కోరిందట. అది కొనివ్వకుంటే, ఇంద్రాణి గత జీవితపు రహస్యాలను బయట పెడతానని బెదిరించిందని, ఇంద్రాణిని హత్యకు పురికొల్పిన ప్రధాన కారణం ఇదే కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. షీనా మెడకు తాడు బిగించి హత్య చేసే క్రమంలో ఆమె నోరును గట్టిగా మూసిన తరువాత, ఇంద్రాణి పదేపదే "ఇక తీస్కో నీ త్రీ బెడ్ రూం ఫ్లాట్" అంటూ పిచ్చిగా అరిచిందట. ఈ విషయాన్ని కారు డ్రైవర్ రాయ్ పోలీసు విచారణలో అంగీకరించాడని సమాచారం. పీటర్ ముఖర్జియాకు చెందిన ఆస్తి లావాదేవీలు కూడా హత్యకు మరో కారణం కావచ్చని పోలీసులు భావిస్తున్నారు. కాగా, ఈ కేసులో అప్రూవర్ గా మారిన డ్రైవర్ రాయ్ ని, కేసులో ప్రధానసాక్షిగా పరిగణిస్తున్నామని పోలీసు వర్గాలు చెబుతున్నాయి.