: మధ్యప్రదేశ్ లో ఘోరం... సిలిండర్ పేలి 20 మంది మృతి


మధ్యప్రదేశ్ లో ఘోర ప్రమాదం జరిగింది. జబువా దగ్గర ఓ హోటల్ లో వంటగ్యాస్ సిలిండర్ పేలుడు జరిగింది. పేలుడు అనంతరం హోటల్ లో అత్యధిక భాగం తగులబడింది. ఈ ప్రమాదంలో 20 మంది మరణించగా, 40 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఉదయం పూట కావడంతో అల్పాహారం నిమిత్తం పలువురు హోటల్ వద్ద ఉండటంతో, బాధితుల సంఖ్య అధికంగా ఉంది. ఘటన వివరాలు తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి వచ్చి సహాయక చర్యలు ప్రారంభించారు. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించారు. చాలా మంది మృతదేహాలు గుర్తు పట్టలేని విధంగా కాలిపోయాయని తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

  • Loading...

More Telugu News