: ముంబయిలో మాంసం అమ్మకాలపై నిషేధం ఒక్కరోజుకే పరిమితం


ముంబయిలో సెప్టెంబర్ 13, 18వ తేదీలలో మాంసం అమ్మకాలు, గోవధపై విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్లు ముంబయ్ నగరపాలక సంస్థ బాంబే హైకోర్టుకు తెలియజేసింది. దీంతో సెప్టెంబర్ 17వ తేదీన మాత్రమే ముంబయిలో ఈ నిషేధం అమల్లో ఉంటుంది. మాంసం అమ్మకాన్ని ఆయా తేదీల్లో నిషేధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ మటన్ డీలర్స్ అసోసియేషన్ బాంబే హైకోర్టుకు వెళ్ళింది. ఈ సందర్భంగా జరిగిన విచారణలో భాగంగా నగరపాలక సంస్థ కోర్టుకు ఈ విషయాన్ని తెలిపింది. కాగా, శివసేన పార్టీ నాయకుడు తృష్ణ విశ్వాస్ రావు మాట్లాడుతూ, మాంసం విక్రయాలపై నిషేధం విధించే రోజుల సంఖ్యను కుదించాలని కార్పొరేటర్లందరూ కలిసి ఉమ్మడిగా తీసుకున్న నిర్ణయమని చెప్పారు.

  • Loading...

More Telugu News