: కాపీ కొట్టనివ్వకుండా పరీక్షలు నిర్వహిస్తావా? అంటూ తుపాకీ గురిపెట్టిన విద్యార్థి
కాపీ కొట్టనివ్వకుండా పరీక్షలు నిర్వహించిన ప్రిన్సిపల్ పై తుపాకీ గురిపెట్టాడో విద్యార్థి. మధ్యప్రదేశ్ లోని భిండ్ జిల్లాలోని జైన్ కళాశాలలో ఓ విద్యార్థి కాపీ కొట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాడు. ప్రిన్సిపల్ పటిష్ఠమైన చర్యలు చేపట్టడంతో ఆ విద్యార్థి కాపీ కొట్టడంలో విఫలమయ్యాడు. దీంతో ఆగ్రహించిన ఆ విద్యార్థి నేరుగా ప్రిన్సిపల్ గదికి వెళ్లి, ప్రిన్సిపల్ ను చంపేస్తానంటూ అతని తలకు తుపాకీ గురిపెట్టాడు. అనంతరం ప్రిన్సిపల్ రూంలోని సామానంతా ధ్వంసం చేసి వెళ్లిపోయాడు. దీనిపై ప్రిన్సిపల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. భిండ్ జిల్లాలో ఇలాంటి ఘటనలు సర్వసాధారణమని సదరు పోలీసులు చెప్పడం కొసమెరుపు.