: కేసీఆర్ చైనా పర్యటన వేస్ట్... ఏ దేశంలోనూ కూడా చైనా కార్యక్రమాలు చేపట్టలేదు: పాల్వాయి


తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చైనాకు వెళ్లి సాధించేది ఏమీ లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రపంచంలోని ఏ దేశంలోను చైనా తన కార్యక్రమాలను చేపట్టలేదని... అలాంటిది, తెలంగాణలో చేపట్టే అవకాశమే లేదని చెప్పారు. కేసీఆర్ పాలన తుగ్లక్ పాలనను తలపిస్తోందని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో తీవ్ర కరవు నెలకొన్నప్పటికీ... సాయం కోసం కేంద్రాన్ని ఎందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు. రైతులపై ప్రైవేట్ వడ్డీ వ్యాపారులు ఒత్తిడి తీసుకురాకుండా చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు. పీసీసీ, సీఎల్సీ కూడా మమేకమై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడాలని కోరారు.

  • Loading...

More Telugu News