: రాధిక కుమార్తెకు, క్రికెటర్ అభిమన్యు మిధున్ కు కుదిరిన పెళ్లి!
ప్రముఖ దక్షిణాది నటి రాధిక కుమార్తె రయానే, క్రికెటర్ అభిమన్యు మిధున్ లకు ఈ నెల 23న నిశ్చితార్థం జరగనున్నట్టు తెలిసింది. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉండగా, ఇంతకాలానికి రెండు కుటుంబాలూ వీరి ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ఇప్పటికి ఇంకా అధికారికంగా వివాహ తేదీ వెల్లడికాలేదు. కాగా, మిధున్ ఐపీఎల్ మ్యాచ్ లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరపున ఎన్నో మ్యాచ్ లు ఆడాడు. రయానే తన తల్లి రాధిక ప్రారంభించిన నిర్మాణ సంస్థలో పనిచేస్తూ, పలు టీవీ సీరియళ్లకు నిర్మాతగా, సహ నిర్మాతగా తల్లికి తనవంతు సహకారాన్ని అందిస్తోంది. నిశ్చితార్థాన్ని దగ్గరి బంధువులు, మిత్రుల సమక్షంలో జరపాలని రాధిక భావిస్తున్నట్టు తెలుస్తోంది.