: అందరి కళ్లూ ఉల్లిపాయలపైనే... అయితే, నిజంగా పేదలకు దూరమైన నిత్యావసరాలు ఇవే!


ఉల్లిపాయల ధరలు ఆకాశానికి ఎక్కిపోయాయి. ఇది ఎవరూ కాదనలేని సత్యం. అయితే, ఉల్లిపాయలు పేదలకు, మధ్య తరగతికి దూరమయ్యాయా? అని ప్రశ్నిస్తే మాత్రం లేదనే సమాధానం వస్తుంది. ఎందుకంటే, దాదాపు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఉల్లిపాయలను సబ్సిడీ ధరలకు అందించే స్కీములు ప్రవేశపెట్టాయి కాబట్టి. ఓ గంటో, రెండు గంటలో క్యూలైన్లలో నిలబడి ప్రజలు ఉల్లిపాయలు కొంటూనే ఉన్నారు. ఇదే సమయంలో ప్రజలకు నిజంగా దూరమైన నిత్యావసర ఆహార ఉత్పత్తులు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పప్పుధాన్యాల ధరలు ఎవరికీ అందనంత ఎత్తునకు చేరాయి. కన్స్యూమర్ అఫైర్స్ విభాగం పరిధిలో ప్రైస్ మానిటరింగ్ సెల్ గణాంకాల ప్రకారం, గత సంవత్సరం సెప్టెంబరులో దేశవ్యాప్తంగా 76 నుంచి 82 రూపాయల మధ్య ఉన్న కందిపప్పు ధర ఇప్పుడు 132 నుంచి 145 రూపాయలకు పెరిగింది. ఇక, 82 నుంచి 90 రూపాయల మధ్య ఉన్న మినప్పప్పు ధర 112 నుంచి 125 రూపాయలకు చేరుకుంది. ఈ రెండేనా?, పెసరపప్పు, పచ్చిశెనగపప్పు, శనగలు, ఆవాలు ఇలా దాదాపు అన్ని నిత్యావసర వస్తు ఉత్పత్తుల ధరలు గత సంవత్సరం వ్యవధిలో 40 నుంచి 60 శాతం వరకూ పెరిగాయి. పుదుచ్చేరి, పనాజి ప్రాంతాల్లో కందిపప్పు ధర రూ. 155కు చేరిందని తెలుస్తోంది. డిమాండుకు తగ్గట్టు సరఫరా లేకపోవడం ఇందుకు ఒక కారణమైతే, వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తుండటం మరో కారణమని నిపుణులు అంటున్నారు.

  • Loading...

More Telugu News