: ఫుట్ బాల్ గోల్ కీపర్ గా తన గిన్నిస్ రికార్డును తానే బద్దలు కొట్టిన బుజ్జి కుక్క పిల్ల!


జపాన్ నివాసి మకోటో కుమంగై దగ్గరున్న బుల్లి కుక్క పిల్ల అది. పేరు ప్యురిన్. చిన్న చిన్న ఫుట్ బాల్ బంతులు విసురుతుంటే, గోల్ ముందు నిలబడి, అటూ ఇటూ దుముకుతూ, వాటిని తమ ముందరి కాళ్లతో పట్టుకుని ఆపుతుంది. గతంలో నిమిషంలో 11 బంతులను ఆపిన ప్యురిన్ కు గిన్నిస్ రికార్డు దక్కింది. తాజాగా, ఒక్క నిమిషంలో 14 బంతులను ఆపి తన రికార్డును తానే బద్దలు కొట్టింది. ప్యురిన్ రెండు కాళ్లపైనే నడుస్తుందని, తనకన్నా పెద్ద శునకాలను చూస్తే భయపడిపోతుందని మకోటో మురిపెంగా చెబుతున్నాడు. అన్నట్టు ప్యురిన్ కు ఓ పిల్లి స్నేహితుడు కూడా ఉన్నాడండోయ్. ఇది తన సైజుకు తగ్గ వస్తువులతో తెగ ఆటాడుకుంటుందట.

  • Loading...

More Telugu News