: మద్యం ఎంతపని చేసింది?
మధ్య చైనాలోని హెనన్ ప్రావిన్స్ లో నేటి తెల్లవారు జామున డాకింగ్-గ్వాంగ్జు ఎక్స్ ప్రెస్ హైవేపై మద్యం తరలిస్తున్న ఓ ట్రక్కు బోల్తా పడింది. దీంతో ట్రక్కులోని మద్యం (రైస్ వైన్'బియ్యంతో తయారైన చైనా మద్యం') హైవేపాలైంది. వెనుకగా వస్తున్న బస్సు ఈ మద్యంపైకి రాగానే జారిపోయింది. దీంతో వాహనంలోని 9 మంది అక్కడికక్కడే మృత్యువుఒడి చేరుకోగా, మరో ముగ్గురు చికిత్స పొందుతూ మృతి చెందారు. దాని వెనుకగా వస్తున్న మరో ట్రక్కు అదుపు తప్పి బస్సును ఢీ కొంది. దీంతో మరో 19 మంది గాయపడ్డారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని బాధితులను ఆసుపత్రికి తరలించారు. ట్రక్కులు, బస్సు డ్రైవర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.