: జీవితభాగస్వామి ఫ్రెండ్ అయితే వెంటనే 'అన్ ఫ్రెండ్' చేయాలట!


ప్రస్తుత స్పీడ్ యుగంలో సామాజిక మాధ్యమాలను వినియోగించుకోని వారి సంఖ్య తక్కువగానే ఉండచ్చు. ముఖ్యంగా ఫేస్ బుక్ లాంటి సామాజిక మాధ్యమం జీవితంలో చొరబడిపోయిందంటే అతిశయోక్తి కాదనిపిస్తుంది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఫేస్ బుక్ పెట్టే చిచ్చు నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలో చెబుతున్నాయి తాజా అధ్యయనాలు. న్యూయార్క్ లోని ప్యూ రీసెర్చ్ సెంటర్ అధ్యయనం ప్రకారం.. భార్యాభర్తలిద్దరూ ఫేస్ బుక్ లో పరస్పరం ఫ్రెండ్స్ గా కనుక ఉంటే, వాళ్లిద్దరిలో ఎవరో ఒకళ్లు 'అన్ ఫ్రెండ్' అయిపోవాలి. లేకపోతే, వారి బంధం బలంగా ఉండదట. ఈవిధంగా చేయడం వల్ల ఏవైనా అపోహలు వారి మధ్య ఉంటే పోతాయట. పండంటి కాపురాన్ని సంతోషంగా సాగిస్తారట. 25 శాతం భార్యాభర్తలు కలిసి ఉంటూ కూడా మాట్లాడుకోవట్లేదు. కానీ, ఎస్ఎమ్మెస్ లు పంపుకుంటున్నారు. మొబైల్ ఫోన్ వాడటాన్ని 25 శాతం భాగస్వామి వ్యతిరేకిస్తుండగా, 8 శాతం భాగస్వామి ఆన్ లైన్లో కనిపించడాన్ని భరించలేకపోతున్నారని అధ్యయనం చెబుతోంది.

  • Loading...

More Telugu News