: శంషాబాద్ విమానాశ్రయంలో ఐఎస్ఐఎస్ సానుభూతిపరుడి స్నేహితురాలి అరెస్ట్
శంషాబాద్ విమానాశ్రయంలో నిక్కీ జోసెఫ్ అనే యువతిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈమె ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థ సానుభూతిపరుడు మొహియుద్దీన్ స్నేహితురాలు. ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థలో చేరేందుకు వెళుతున్న అతడు గతేడాది శంషాబాద్ విమానాశ్రయంలో పోలీసులకు పట్టుబడ్డాడు. దానిపై తరువాత విచారణ జరిపిన పోలీసులు... స్నేహితురాలు నిక్కీ ప్రమేయంతోనే మొహియుద్దీన్ ఐఎస్ఐఎస్ లో చేరేందుకు సిద్ధమైనట్టు తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో దుబాయ్ లో ఉంటున్న నిక్కీని పక్కా ప్రణాళికతో హైదరాబాద్ కు రప్పించి పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమెను సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ విచారిస్తున్నారు.