: దేశాభివృద్ధిని అడ్డుకునేందుకు 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారు: మోదీ
పార్లమెంట్ కార్యకలాపాలను అడ్డుకున్న కాంగ్రెస్ పార్టీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీవ్ర విమర్శలు చేశారు. ఆ పార్టీ దేశాభివృద్ధిని అడ్డుకుంటోందన్నారు. 400 మంది ఎంపీలు దేశాన్ని అభివృద్ధి చేయాలని చూస్తుంటే దానికి వ్యతిరేకంగా 40 మంది ఎంపీలు కుట్ర చేస్తున్నారంటూ కాంగ్రెస్ పై పరోక్షంగా ఆరోపించారు. లోక్ సభలో తమ గొంతు నొక్కితే జనసభకు వెళతామని, ఇది పార్లమెంట్ దిగువ సభ కంటే పెద్దదని ప్రధాని పేర్కొన్నారు. పార్లమెంట్ లో వారు వ్యవహరించిన తీరు చూసిన తరువాత కొన్ని పార్టీలను ప్రజలు క్షమించరన్నారు. అహంకారంతో ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు. ఛండీగడ్ లో ఈరోజు పర్యటిస్తున్న మోదీ అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగసభలో పైవిధంగా మాట్లాడారు. మాజీ సైనికులకు వన్ ర్యాంక్ వన్ పెన్షన్ అమలు చేసిన ఘనత తమదేనని పేర్కొన్నారు.