: ఇంద్రాణి ముఖర్జియా బ్రిటిష్ పౌరసత్వం తీసుకుందా?


తన కుమార్తె హత్య కేసులో నిందితురాలు ఇంద్రాణి ముఖర్జియా గతంలో యునైటైడ్ కింగ్ డమ్ పౌరసత్వం తీసుకుంది. ఈ కేసు నుంచి తప్పించుకునేందుకుగాను అక్కడికి పారిపోతుందా? అనే వదంతులు వ్యాపిస్తున్నాయి. 2012-13 మధ్య కాలంలో ఆమె బ్రిటన్ పౌరసత్వం తీసుకున్నట్లు సమాచారం. ముంబై కి చెందిన డీఎన్ఎ పత్రికలో ప్రచురించిన కథనం ప్రకారం, ఇంద్రాణి ముఖర్జియా భర్త, స్టార్ ఇండియా సీఈఓ, పీటర్ ముఖర్జియా ఆమె పాసుపోర్టును, బ్రిటిష్ పౌరసత్వ డాక్యుమెంట్లను పోలీసులకు స్వాధీనం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ, ఇంద్రాణి కనుక బ్రిటన్ కు పారిపోతే కేసు విచారణ కష్టమవుతుందన్న ఉద్దేశ్యంతోనే పీటర్ ఈ పని చేసినట్లు రాసుకొచ్చింది. అయితే, దీనిపై న్యాయనిపుణులు మాట్లాడుతూ, ఈ కేసులో అరెస్టు నుంచి తప్పించుకునేందుకని ఆమె బ్రిటిష్ పౌరసత్వం తీసుకుని ఉండవచ్చని అంటున్నారు. ఈ సందర్భంగా సీనియర్ క్రిమినల్ లాయర్ మజీద్ మెమన్ మాట్లాడుతూ 'ఆమె పౌరసత్వంతో కేసుకి సంబంధం లేదు. ఎందుకంటే, ఆమెను జైల్లో ఉంచారు. ప్రస్తుత పరిస్థితులలో ఆమె పౌరసత్వ ప్రభావం ఏదీ కేసుపై ఉండదు. నేరం జరిగిన దేశంలో చట్టాలను అనుసరించి నిందితుడికి శిక్ష ఉంటుంది. కనుక నిందితుడు లేదా నిందితురాలు ఏ దేశానికి చెందిన వారైనా ఏమీ ఇబ్బంది ఉండదని చెప్పారు.

  • Loading...

More Telugu News