: షర్మిల రెండో విడత పరామర్శ యాత్ర ముగిసింది


వైకాపా అధినేత జగన్ సోదరి షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండో విడత పరామర్శ యాత్ర ముగిసింది. రెండో విడతలో వరంగల్ జిల్లాలోని 6 నియోజకవర్గాల్లో మొత్తం 30 కుటుంబాలను షర్మిల పరామర్శించారు. ఈ వివరాలను ఆ పార్టీ నేత కొండా రాఘవరెడ్డి తెలిపారు. ఈ నెల 21, 22వ తేదీల్లో వరంగల్ జిల్లాలో షర్మిల మూడో విడత యాత్ర కొనసాగుతుందని చెప్పారు. వరంగల్ లోక్ సభ స్థానానికి జరగనున్న ఉపఎన్నికపై... ఈ నెల 13, 14 తేదీల్లో జరిగే కార్యవర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకుంటామని రాఘవరెడ్డి వెల్లడించారు.

  • Loading...

More Telugu News