: ముస్లింల కోసం మసీదు కట్టించిన సిక్కులు
ఇండియాలో మత సామరస్యం ఎలా ఉందో చెప్పడానికి ఇదో చక్కని ఉదాహరణ. పంజాబ్ లోని ఓ చిన్న గ్రామం సర్వాపూర్ లో ముస్లింలు నమాజు చేసుకోవడానికి సిక్కులు ఓ మసీదు కట్టించారు. ఆ గ్రామంలోని మోతుబరి రైతు జోగాసింగ్ తీసుకున్న నిర్ణయం అక్కడి ముస్లింలు రోజూ 10 కిలోమీటర్లు ప్రయాణించకుండా చేసింది. తమ గ్రామంలోని ముస్లింలు నమాజు కోసం అంతదూరం వెళ్లి రావడం చూసి బాధపడ్డ జోగా సింగ్, ముందు నిలిచి మసీదును నిర్మించాడు. ఆ గ్రామంలో గతంలో ఓ మసీదు ఉండగా, ఎప్పుడో తలెత్తిన ఘర్షణల్లో దాన్ని కూలగొట్టారు. "సిక్కు సోదరులే అండగా నిలవకుంటే, మేము ఎన్నడూ ఈ గ్రామంలో మసీదును నిర్మించుకుని ఉండేవాళ్లం కాదు" అని గ్రామ నివాసి మహమ్మద్ జమీల్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. అన్ని ప్రాంతాల్లో ఇదే విధమైన వాతావరణం ఉంటే, ఇండియాలో మత ఘర్షణలు అన్న మాటే తలెత్తదంటే నిజమే కదా?