: జగన్ పై లోకేశ్ ఫైర్... అబద్ధాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ధ్వజం


టీడీపీ కార్యకర్తల సంక్షేమ నిధి సమన్వయకర్త నారా లోకేశ్ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. నేటి ఉదయం విజయవాడ నుంచి ప్రకాశం జిల్లా కందుకూరు చేరుకున్న లోకేశ్, పార్టీ కార్యకర్తల కోసం ఏర్పాటు చేసిన రాజకీయ శిక్షణా తరగతులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ జగన్ పై ఘాటు విమర్శలు చేశారు. అబద్ధాలు చెబుతున్న జగన్ ప్రజలను మభ్యపెడుతున్నారని లోకేశ్ ఆరోపించారు. జగన్ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ పటిష్ఠత కోసమే కార్యకర్తలకు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు. విద్యాలయాల్లో ర్యాగింగ్ కు చెక్ పెట్టేందుకు తెలుగునాడు స్టూడెంట్ ఫెడరేషన్ (టీఎన్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో ప్రత్యేక దళాలను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

  • Loading...

More Telugu News