: ఇకపై ఉన్నత వైద్య విద్య కోసం అమెరికా వెళ్లి, అక్కడే ఉండిపోవడం కుదరదు!
వైద్యవిద్య పేరిట అమెరికా వెళ్లిపోయి, అక్కడ ఉన్నత చదువులు పూర్తి చేసుకుని అక్కడే ఉండిపోయే అవకాశం దూరం కానుంది. వైద్య విద్య తరువాత, డాక్టర్లు విదేశాలకు వెళ్లి అక్కడే ఉంటున్న ఉదంతాలు పెరగడంతో, ఈ మేధోవలసలను అడ్డుకునే దిశగా ఆరోగ్య మంత్రిత్వ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై 'నో ఆబ్లిగేషన్ టు రిటర్న్ టు ఇండియా' అనే ఒప్పందానికి అంగీకరిస్తేనే వారు ఉన్నత విద్య నిమిత్తం దేశం దాటగలుగుతారు. ఈ నిర్ణయం అమలైతే, యూఎస్ లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేసేందుకు వెళ్లినవారు తప్పనిసరిగా తిరిగి ఇండియాకు రావాల్సి వుంటుంది. మేధోవలసను నివారించేందుకే భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనుందన్న సమాచారం వినవస్తోంది.