: మాంసంపై నిషేధం కొనసాగితే విపరీత పరిణామాలు తప్పవు : మాజీ ఎంపీ సిద్ధిఖీ
త్వరలో ముస్లింల పండుగ బక్రీద్ రానున్న నేపథ్యంలో దేశంలో మాంసం అమ్మకాలపై నిషేధం ఇలాగే కొనసాగితే అది విపరీత పరిణామాలకు దారితీస్తుందని మాజీ ఎంపీ షాహిద్ సిద్ధిఖీ అన్నారు. గోమాంసం నిషేధంతో దేశానికి, సమాజానికి భారతీయ జనతా పార్టీ హాని చేయాలనుకుంటోందని ఆయన ఆరోపించారు. జైనుల పండుగ నేపథ్యంలో దేశంలోని పలు రాష్ట్రాల్లో మాంసం అమ్మకాలపై నిషేధం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సిద్దిఖీ ఈ వ్యాఖ్యలు చేశారు. మాంసంపై నిషేధం విధించడం ద్వారా ఒకరిని సంతృప్తి పరచాలనుకోవడం సబబు కాదన్నారు. ఎవరేమి తినాలో, తినకూడదో అనే దానిని చర్చనీయాంశం చేయడం హాస్యాస్పదంగా ఉంటుందని సిద్ధిఖీ ఎద్దేవా చేశారు.