: మోదీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు
మోదీ సర్కారు మాలేగావ్ పేలుళ్ల కేసులో తలదూర్చి, విచారణను ప్రభావితం చేస్తోందని స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలపడంతో, ఈ విషయమై సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ధర్మాసనం కేంద్రానికి నోటీసులు పంపింది. మోదీ పదవీ బాధ్యతలు చేపట్టిన తరువాత కేసు విచారణలో ఉదాసీనంగా ఉండాలంటూ, జాతీయ దర్యాప్తు అధికారుల (ఎన్ఐఏ) నుంచి తనపై ఒత్తిడి పెరిగిందని స్పెషల్ పీపీ రోహిణి ఆరోపించడంతో సుప్రీంకోర్టు మండిపడింది. ఎన్ఐఏ తీరును తప్పుబట్టింది. మోదీ ప్రభుత్వాన్ని, జాతీయ సంస్థల తీరును గర్హిస్తూ, వచ్చిన ఆరోపణలకు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.