: నాంపల్లి కోర్టులో వైఎస్ జగన్... అక్రమాస్తుల కేసులో విచారణకు హాజరు


వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కొద్దిసేపటి క్రితం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వచ్చారు. అక్రమాస్తుల కేసు విచారణకు సంబంధించి ఆయన కోర్టులో హాజరయ్యారు. జగన్ తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తదితరులు కూడా కోర్టుకు వచ్చారు. ఇటీవల కేసు విచారణలో వేగం పెంచిన కోర్టు ప్రతి శుక్రవారం ఈ కేసు విచారణను చేపట్టనున్నట్లు ప్రకటించింది. సదరు విచారణలకు ఇకపై నిందితులంతా తప్పనిసరిగా హాజరుకావాల్సిందేనని కూడా తేల్చిచెప్పింది. ఈ నేపథ్యంలోనే మొన్నటిదాకా కాస్తంత ఊపిరి పీల్చుకున్న జగన్ ఇటీవల తరచూ కోర్టుకు రావాల్సి వస్తోంది.

  • Loading...

More Telugu News