: నవ్యాంధ్రలో కార్యాలయ ప్రవేశం చేసిన ఏపీ సీఎస్ ఐవైఆర్
రాష్ట్ర విభజన తర్వాత నవ్యాంధ్ర రాజధానికి ఏపీ పాలనా యంత్రాంగం వడివడిగా తరలిపోతోంది. రాజధాని నిర్మాణం ప్రారంభం కాకపోయినా, విజయవాడలో ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు ఈ కార్యాలయం నుంచే పాలనను సాగిస్తున్నారు. తాజాగా చంద్రబాబు కార్యాలయంలో ఏర్పాటైన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయంలోకి ఏపీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు కొద్దిసేపటి క్రితం అడుగుపెట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం సుముహూర్తంలోనే ఐవైఆర్ తన కోసం కేటాయించిన ఆఫీస్ లోకి ప్రవేశించారు. ఇకపై చంద్రబాబుతో పాటు ఐవైఆర్ కూడా వారంలో ఎక్కవ రోజులు అక్కడే ఉండనున్నారు.