: మాజీ టెన్నిస్ స్టార్ కు పోలీసుల నుంచి భయంకర అనుభవం!


జేమ్స్ బ్లేక్... అమెరికన్ టెన్నిస్ ప్లేయర్. గతంలో ఎన్నో మ్యాచ్ లు ఆడి, వేలాది మంది అభిమానులున సంపాదించుకున్నాడు. అయితేనేం, నల్ల జాతీయుడు. ఆ ఒక్క కారణమే ఆయనకో భయానక అనుభవాన్ని చూపించింది. అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ పోటీలకు బ్లేక్ వెళుతుండగా, ఈ ఘటన జరిగింది. మొబైల్ ఫోన్లను దొంగిలించిన కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసుల బృందానికి బ్లేక్ కనిపించాడు. బ్లేక్ ను గుర్తు పట్టని పోలీసులు, దొంగగా భావించారు. వివరాలు కూడా అడగకుండా, చేతులకు బేడీలు వేసేశారు. నేలపై తోసి కదలకుండా అదిమేశారు. యూఎస్ ఓపెన్ పోటీలకే వెళుతున్న మరో వ్యక్తి బ్లేక్ ను గుర్తుపట్టి పోలీసులకు విషయం చెప్పడంతో, తప్పు తెలుసుకుని వదిలేశారు. ఈ ఘటనలో బ్లేక్ కాళ్లకు, చేతులకు గాయాలు కాగా, పోలీసుల తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఈ ఘటనకు కారణమైన వారిపై చర్యలు తీసుకుంటామని ఉన్నతాధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News