: డబ్బున్నోళ్లకు సామాజిక మాధ్యమాల్లో 'ఫ్రెండ్స్' తక్కువే!
"బాగా డబ్బున్న యువతీ యువకులకు సామాజిక మాధ్యమాల్లో ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుంది. వారికి మిత్రులు కూడా అధికంగా ఉంటారు" అన్న భావన మీలో ఉందా? అయితే, అది తప్పు. డబ్బున్న వారికి ఫేస్ బుక్ లో చాలా తక్కువ మంది ప్రెండ్స్ ఉన్నారు. ముఖ్యంగా విదేశీ స్నేహితుల విషయంలో... ధనవంతులతో పోలిస్తే, తక్కువ హోదా కలిగివున్న వారికి 50 శాతం అధిక సంఖ్యలో విదేశీ స్నేహితులు ఉన్నారు. యూనివర్శిటీ ఆఫ్ కేంబ్రిడ్జ్ సహాయంతో ఫేస్ బుక్ ఓ సర్వే నిర్వహించి ఈ వివరాలు వెల్లడించింది. నెటిజన్లలో సామాజిక, ఆర్థిక హోదా, ఇంటర్నేషనల్ స్థాయిలో వారికున్న సంబంధాలపై విశ్లేషించింది. అధిక సంఖ్యలో నెట్ మిత్రులను పొందడంలో డబ్బున్న వారికంటే, డబ్బు తక్కువగా ఉన్నవారే దూసుకెళుతున్నారని పేర్కొంది.