: బెజవాడకు పాకిన 'ముష్టి'యా... 26 మంది చిన్నారులను రక్షించిన అధికారులు


పసిపిల్లలను బలవంతంగా ఏడిపిస్తూ జనాల హృదయాలను ద్రవించేలా చేసి బిక్షమెత్తుకునే విష సంస్కృతి హైదరాబాదును దాటి నవ్యాంధ్ర రాజధానికి కూడా చేరుతోంది. ప్రస్తుతం విజయవాడ నగరంలోని పలు ప్రధాన కూడళ్లలో చిన్న పిల్లలను చంకనేసుకుని వాహనదారుల వద్ద బిక్షమెత్తుకుంటున్న మహిళలు పెద్ద సంఖ్యలో కనిపిస్తున్నారు. దీనిపై దృష్టి సారించిన ఏపీ స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నిన్న నగరంలోని పలు ప్రాంతాల్లో దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మహిళలను అదుపులోకి తీసుకున్న అధికారులు 26 మంది చిన్నారులకు ఈ ‘బెగ్గింగ్’ మాఫియా నుంచి విముక్తి కల్పించారు. నెలల వయసు ఉన్న పిల్లలను చంకనేసుకునే మహిళలు, పిల్లలను బలవంతంగా ఏడిపిస్తూ బిక్షాటన కొనసాగిస్తున్నారు. దాడుల్లో భాగంగా మాఫియా సభ్యులు పలువురు పిల్లలకు బిక్షాటన నేర్పిస్తున్న వైనాన్ని అధికారులు వెలికితీశారు. పలు ప్రాంతాల్లో బిక్షాటనే కాక, హోటళ్లలో పనిచేస్తున్న పిల్లలను కూడా గుర్తించి బాలల సంరక్షణ కేంద్రానికి తరలించారు.

  • Loading...

More Telugu News