: చంద్రబాబు ఢిల్లీ పర్యటన రద్దు... కారణమేంటంటే...!


ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నేడు దేశ రాజధాని ఢిల్లీ వెళ్లాల్సి ఉంది. అయితే నిన్న ఉన్నపళంగా తన ఢిల్లీ పర్యటనను చంద్రబాబు రద్దు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో నేడు విజయవాడలోనే ఉండే చంద్రబాబు పలు ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశాల్లో పాల్గొంటారు. అసలు చంద్రబాబు ఢిల్లీ పర్యటన ఎందుకు రద్దయిందంటే... ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమ అమలుకు సంబంధించిన సబ్ కమిటీకి చంద్రబాబు నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ఢిల్లీలో జరగనున్న నీతి ఆయోగ్ సమావేశంలో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరగాల్సి ఉంది. స్వచ్ఛ భారత్ కు సంబంధించి ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న కార్యక్రమాలపై ప్రత్యేకంగా నివేదికలు రావాల్సి ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల సీఎంల నుంచి సదరు నివేదికలు చంద్రబాబుకు అందలేదు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబు తన పర్యటనను రద్దు చేసుకున్నారట.

  • Loading...

More Telugu News