: జలకళతో జూరాల... విద్యుదుత్పత్తి ప్రారంభం


ఐదారు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని జలాశయాల్లో జలకళ ఉట్టిపడుతోంది. తెలంగాణలో కృష్ణా నదిపై నిర్మించిన 'ఇందిరా ప్రియదర్శిని' జూరాల ప్రాజెక్టు దాదాపుగా నిండిపోయింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రాజెక్టు వరద నీటితో పోటెత్తింది. నిన్నటిదాకా ఖాళీగా కనిపించిన ప్రాజెక్టు ప్రస్తుతం దాదాపు పూర్తి స్థాయి నీటి మట్టంతో కనిపిస్తోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 అడుగులు కాగా, ప్రస్తుతం 318.45 అడుగులదాకా నీరు చేరింది. ఇంకా ప్రాజెక్టుకు వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ప్రాజెక్టుకు 13,580 క్యూసెక్కులు ఇన్ ఫ్లోగా చేరుతుండగా, కిందకు 24,850 క్యూసెక్కుల నీరు ఔట్ ఫ్లోగా కిందకు వెళుతోంది. భారీ ఎత్తున నీటిని కిందకు వదులుతున్న అధికారులు ప్రాజెక్టులోని మూడు గేట్లను ఎత్తేసి మూడు యూనిట్లలో విద్యుదుత్పత్తిని ప్రారంభించారు.

  • Loading...

More Telugu News