: మనుషులను పోలిన కొత్తజీవుల అవశేషాలు బయటపడ్డాయి
మనుషులను పోలిన కొత్త రకం జంతువుల అవశేషాలు దక్షిణాఫ్రికాలోని మారుమూల ప్రాంతంలో బయటపడ్డాయి. రైజింగ్ స్టార్ అనే ఓ గుహలో మొత్తం 15 రకాల జంతువులకు చెందిన అవశేషాలు లభ్యమయ్యాయి. అందులో 1500 ఎముకలు ఉన్నాయి. ఈ అవశేషాలు మానవులకు దగ్గరగా ఉన్నాయని పరిశోధకులు తెలిపారు. ఆ జీవులకు మనుషుల్లాగే తల, మెదడు ఉందని గుర్తించారు. చెట్లు ఎక్కేందుకు వీలుగా వీటికి చేతి వేళ్లు కూడా ఉన్నాయని వారు వెల్లడించారు. ఈ కొత్త జాతికి 'హోమోనలేది' అనే పేరు పెట్టారు.