: లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చెబుతా...నా దగ్గరకు రా!: మంత్రి లక్ష్మారెడ్డి
తెలంగాణలో ఆత్మహత్యల నివారణకు ప్రత్యేక సెల్ ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ ఆత్మహత్యల నివారణ సెల్ ను మంత్రి లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సెల్ కు వచ్చిన తొలి ఫోన్ కాల్ ను ఆయన రిసీవ్ చేసుకున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్యకు సిద్ధపడిన కిరణ్ అనే వ్యక్తితో మాట్లాడిన మంత్రి, జీవితం విలువైనదని, అది తెలుసుకుని, మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను ప్రేమించవచ్చని ఆయన తెలిపారు. ప్రేమ కోసం ప్రాణం తీసుకుంటే, కని పెంచిన వారి పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. తనను కలిస్తే మరిన్ని విషయాలు చెబుతానని ఆయన చెప్పారు. 'లవ్ స్టోరీ ఎలా ఉంటుందో చెబుతాను. సెక్రటేరియట్ కు వచ్చి నన్ను కలు' అంటూ మంత్రి ఆ యువకుడికి సూచించారు. చివరికి ఆత్మహత్య చేసుకోనని అతని నుంచి మాట తీసుకున్న మంత్రి, తన ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. అనంతరం యువతను రక్షించాలనే లక్ష్యంతో ఈ సెంటర్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు.