: మహిళ అసహాయతను అడ్డంపెట్టుకుని దారుణానికి తెగబడ్డ కామాంధులు


ఒంటరి మహిళ అసహాయతను అడ్డం పెట్టుకున్న కామాంధులు సామూహిక అత్యాచారానికి తెగబడ్డారు. మహారాష్ట్రలోని చందూర్ బజార్ కు చెందిన ఓ 25 ఏళ్ల మహిళ భర్త నుంచి విడివడి ఏడేళ్ల కుమార్తెతో ఒంటరిగా జీవిస్తోంది. ఓ అవసరం నిమిత్తం తనకు తెలిసిన ఓ వ్యక్తిని 1500 రూపాయలు అప్పు అడిగింది. సరే ఇస్తానని చెప్పిన ఆ వ్యక్తి రిద్దాపూర్ వస్తే ఇస్తానని చెప్పాడు. తన మిత్రుడితో కలిసి రావాలని ఆమెకు సూచించాడు. అది నిజమని నమ్మిన ఆమె, అతని స్నేహితుడితో బయల్దేరింది. మార్గమద్యంలో ఆమెపై కామాంధులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో పోలీసులను ఆశ్రయించిన ఆమె జరిగిన ఘోరాన్ని వివరించింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, ఇద్దరు మైనర్లు సహా ఏడుగుర్ని అదుపులోకి తీసుకున్నారు.

  • Loading...

More Telugu News