: గ్రామాల దత్తతపై తమిళ సినీ నటులకు విన్నపం!
తమిళ సినీ నటులు తమ రాష్ట్రంలో గ్రామాలను దత్తత తీసుకోవాలని 'కొంగునాడు జననాయక కట్చి' (కేజేకే) అధ్యక్షుడు నాగరాజ్ పిలుపునిచ్చారు. తెలుగు సినీ నటులు మహేష్ బాబు, ప్రకాశ్ రాజ్ లను ఆదర్శంగా తీసుకుని తమిళ నటులు కూడా ప్రతి ఒక్కరూ ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకోవాలని ఆయన కోరారు. తమిళనాడులో వెనుకబడిన గ్రామాలు చాలా ఉన్నాయని ఆయన తెలిపారు. కొన్ని గ్రామాల్లో మరుగుదొడ్లు, మంచి నీటి సరఫరా సైతం లేవని, పురుషులు మద్యానికి బానిసలై మహిళల్ని హింసిస్తుంటారని ఆయన చెప్పారు. సినీ నటులు ఒక్కో గ్రామాన్ని దత్తత తీసుకుంటే ప్రగతి సాధించవచ్చని ఆయన చెప్పారు.