: చంద్రబాబు, భువనేశ్వరిల వెడ్డింగ్ కార్డును ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన నారా రోహిత్
నేడు ఏపీ సీఎం చంద్రబాబు, భువనేశ్వరిల 34వ పెళ్లి రోజు. ఈ సందర్భంగా చంద్రబాబు, భువనేశ్వరిల వివాహ ఆహ్వాన పత్రికను సినీ హీరో నారా రోహిత్ ఫేస్ బుక్ లో పోస్టు చేశాడు. రోహిత్ చంద్రబాబు సోదరుడి కుమారుడు అన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన పెద్దమ్మ, పెదనాన్నకి శుభాకాంక్షలు తెలిపాడు. వెడ్డింగ్ కార్డులో వివరాలు చూస్తే, 1981లో ఇదే రోజు ఉదయం సమయంలో మద్రాస్ లో బాబు, భువనేశ్వరిల వివాహం జరిగింది. అప్పటికి చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ చలనచిత్ర పరిశ్రమ, పురావస్తు శాఖ మంత్రిగా ఉన్నారు.