: బీహార్ లో మహాకూటమిదే విజయం... బీజేపీకి తప్పదు పరాభవం: సీ-ఓటర్ సర్వే


బీహార్ శాసనసభ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేయడంతో... రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నేతలంతా ఎత్తులు, పైఎత్తులతో విజయం కోసం ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ నేపథ్యంలో, సీ-ఓటర్ సంస్థ ద్వారా ఇండియా టీవీ ప్రజాభిప్రాయ సేకరణ జరిపించింది. ఈ సర్వే ద్వారా, మొత్తం 243 శాసనసభ స్థానాలకు గాను జేడీయూ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కూడిన మహాకూటమి 116 నుంచి 132 స్థానాల్లో జయకేతనం ఎగురవేస్తుందని సీ-ఓటర్ అంచనా వేసింది. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 94 నుంచి 110 మధ్య స్థానాలు దక్కవచ్చని తెలిపింది. మహాకూటమికి 43 శాతం, ఎన్డీయేకు 40 శాతం, ఇతరులకు 17 శాతం ఓట్లు రావచ్చని వెల్లడించింది. మరోవైపు, ముఖ్యమంత్రి అభ్యర్థిగా నితీష్ కుమారే బెస్ట్ అని 53 శాతం మంది అభిప్రాయపడితే, బీజేపీ నేత సుశీల్ మోడీ వైపు 18 శాతం మంది మొగ్గు చూపారు.

  • Loading...

More Telugu News